ప్రతి 20 ఏళ్లకు సీన్‌‌‌‌ ఛేంజ్‌‌‌‌

రిపబ్లిక్‌‌‌‌గా ఏర్పడ్డాక 1951–52లో మొట్టమొదటిసారి పార్లమెంట్‌‌‌‌ ఎన్నికలు జరిగాయి. ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి రెండు దశాబ్దాలకొకసారి దేశంలో పొలిటికల్‌‌‌‌ సీన్‌‌‌‌ మారిపోతూ ఉంటుంది.  1971, 1991, 2011ల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఆ తర్వాత కీలకమైన సామాజిక, ఆర్థిక మార్పులకు దారి తీశాయి. స్వాతంత్య్రం వచ్చిన మొదటి ఇరవై ఏళ్లూ అప్పటి అధికార కాంగ్రెస్‌‌‌‌ ప్రజాస్వామ్య పంథాలో సాగింది. ఆ తర్వాత నుంచి ఇందిరా గాంధీ హయాం మొదలై వ్యక్తి చుట్టూ పాలిటిక్స్‌‌‌‌ తిరగడం మొదలైంది.  1971కల్లా నియంతృత్వ ధోరణి చోటు చేసుకుంది. 1975లో ఎమర్జెన్సీకి దారితీయడం, ప్రతిపక్షాలన్నీ ఏకమై 1977లో జనతా పార్టీగా అవతరించి, ఇందిరా గాంధీని ఓడించడం జరిగిపోయాయి.  తర్వాత పరిణామాల్లో ప్రతిపక్షాలన్నీ చీలిపోయేసరికి 1980, 1984 ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌ గెలిచింది. 1989లో మళ్లీ ప్రతిపక్షాలు ఎన్‌‌‌‌.టి.రామారావు నాయకత్వంలో నేషనల్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌గా ఏర్పడి కేంద్రంలో అధికారానికొచ్చాయి.  ఎంత ఆదర్శంగా ఏకమయ్యాయో, అంతే స్వార్థంతో చీలిపోవడంతో 1991లో మధ్యంతర ఎన్నికలొచ్చాయి.

1991లో అనుకోని రీతిలో పి.వి.నరసింహారావు  244  సీట్లతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పరచి అయిదేళ్లపాటు నడిపారు. లోక్‌‌‌‌సభలో మేజిక్‌‌‌‌ ఫిగర్‌‌‌‌ 273 కన్నా తక్కువే. అయినాగానీ, ధైర్యంగా ఆయన ఆర్థిక రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు, సరళీకరణ విధానాలు దేశానికొక కొత్త దిశను చూపించాయి. అయితే, కాంగ్రెస్‌‌‌‌ కల్చర్‌‌‌‌ ప్రకారం  గాంధీ–నెహ్రూ కుటుంబ పాలనకు చోటు లేకపోయింది. దీంతో పీవీని కాంగ్రెస్‌‌‌‌ సొంతం చేసుకోలేదు. 1996 ఎన్నికల్లో అచ్చంగా హంగ్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ ఏర్పడింది. మరోవైపున కాంగ్రెస్‌‌‌‌లో వ్యక్తి పూజ మళ్లీ మొదలైంది. 1996 ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌కి 140, బీజేపీకి 161, జనతాదళ్‌‌‌‌కి 46 సీట్లు వచ్చాయి. ప్రతిపక్షాలు యునైటెడ్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌గా ఏకమై  కాంగ్రెస్‌‌‌‌ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 1998, 1999 వరకు వెంటవెంటనే మధ్యంతర ఎన్నికలు రావడంవల్ల ప్రతిపక్షాల అలయెన్స్‌‌‌‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. 2004 ఎన్నికల నాటికి దేశంలో కాంగ్రెస్‌‌‌‌ నాయకత్వంలో యుపిఏ, బీజేపీ నాయకత్వంలో ఎన్‌‌‌‌డీఏ బలంగా ఏర్పడగా, వామపక్షాలు ఈ ఫ్రంట్‌‌‌‌లకు దూరంగా నిలబడ్డాయి.

రానురానూ కమ్యూనిస్టులు పొలిటికల్‌‌‌‌గా క్షీణించిపోవడానికి ఇదికూడా ఒక కారణం. 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు యూపీఏదే రాజ్యం. 2012లో గుజరాత్‌‌‌‌ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ నాలుగోసారి బాధ్యతలు అందుకున్నాక, దేశవ్యాప్తంగా ఆయన పాపులారిటీ పెరిగింది. 2014 లో మోడీ నాయకత్వంలో ఎన్‌‌‌‌డీఏ అద్భుత ఫలితాలు సాధించి అయిదేళ్లు గవర్నమెంట్‌‌‌‌ని నడపగలిగింది. 1996 తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు దేశంలో హంగ్‌‌‌‌ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒక దశలో దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడింటా రెండొంతుల్లో ప్రభుత్వాలు ఏర్పరచిన ఎన్‌‌‌‌డీఏ ఇప్పుడు పలచబడింది. నేలమట్టమైపోయిందనుకున్న కాంగ్రెస్‌‌‌‌ పార్టీ పోయినేడాది మూడు కీలక రాష్ట్రాల్లో అధికారానికొచ్చి కాలర్‌‌‌‌ ఎగరేస్తోంది.