ప్రజలను మభ్యపెట్టేలా బడ్జెట్: కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే

ప్రజలను మభ్యపెట్టేలా బడ్జెట్: కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే

ప్రజలను మభ్య పెట్టేదిగా ప్రస్తుత బడ్జెట్ ఉంది. గత పదేండ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల నుంచి రూ.54.18 లక్షల కోట్ల ఆదాయపు పన్ను వసూలు చేసింది. ఇప్పుడు రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపును ఇస్తున్నమని ప్రకటించింది.  ప్రస్తుత బడ్జెట్ తో ఏడాదికి రూ.80 వేలు ఆదా అవుతాయని  ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. అంటే నెలకు రూ.6,666  మాత్రమే. బడ్జెట్ లో రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. -