నీట్ పరీక్ష పేపర్లు లీకయ్యాయి..విచారణ జరిపించాలి: మల్లికార్జున్ ఖర్గే

నీట్ పరీక్ష పేపర్లు లీకయ్యాయి..విచారణ జరిపించాలి: మల్లికార్జున్ ఖర్గే

న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వ చర్యలతో నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందన్నారు కాంగ్రెస్  అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. నీట్ పరీక్షలో గ్రేస్ మార్కుల సమస్య ఒక్కటే కాదు.. పరీక్ష పేపర్లు లీకయ్యాయని అన్నారు. 

ఎగ్జామ్ సెంటర్స్ , కోచింగ్ సెంటర్లతో కుమ్మక్కయి.. డబ్బులు ఇవ్వండి.. నీట్ ప్రశ్నాపత్రాలు తీసుకోండి అనే ఆట సాగిందన్నారు ఖర్గే. మోదీ ప్రభుత్వం తన చర్యల ను సమర్థించుకునేందుకు, జవాబుదారీతనం నుంచి తప్పించుకునేందుకు NTAను బాధ్యులను చేయాలని చూస్తోందన్నారు. మొత్తం నీట్ కుంభకోణంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. 

విచారణ తర్వాత దోషులను కఠినంగా శిక్షించి లక్షలాది మంది విద్యార్థులకు పరిహారం చెల్లించాలన్నారు. విద్యార్థుల విద్యా సంవత్సరం వృధా కాకుండా కాపాడా లని కోరారు. గత పదేళ్లలో లీకేజీలతో కోట్లాది మంది యువత భవిష్యత్ ను మోదీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.