రాహుల్ జోడో యాత్రతో ఓట్లు సీట్లు పెరిగినయ్: ఖర్గే

రాహుల్ జోడో యాత్రతో ఓట్లు సీట్లు పెరిగినయ్: ఖర్గే

రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ కు  ఓట్లు సీట్లు పెరిగాయన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.  మణిపూర్ లో రెండు సీట్లు గెలుచుకున్నామని, మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. ఢిల్లీలో జరిగిన CWC సమావేశంలో పాల్గొన్న ఖర్గే.. ప్రజలు పార్టీపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయొద్దన్నారు. ఇండియా కూటమి పలు రాష్ట్రాల్లో గణనీయమైన పాత్ర పోషించిందని చెప్పారు. 

ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో  కాంగ్రెస్  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేతలు సోనియా,  రాహుల్, ప్రియాంక హాజరైన మీటింగ్ లో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్నాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ CM సుక్విందర్ సింగ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్,  CWC ప్రత్యేక ఆహ్వానితుడు దామోదర రాజనర్సింహ,  అటెండ్ అయ్యారు. ఏపీ నుంచి రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, పల్లంరాజు హాజరయ్యారు.