దళితబంధు డబ్బులను ఆపిందే బీఆర్ఎస్​ : సొల్లు బాబు

హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు డబ్బులు రాకుండా ఆపిందే బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీ అని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు ఆరోపించారు. మంగళవారం టౌన్‌‌‌‌‌‌‌‌లోని పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉండగా దళితబంధు రెండో విడత డబ్బులను ఎందుకు రిలీజ్​ చేయలేదని ప్రశ్నించారు. 

ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళితులను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నారన్నారని మండిపడ్డారు. దళిత బంధు ఫండ్స్‌‌‌‌‌‌‌‌ విడుదలకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఈ విషయంలో రాజకీయం చేయడం మానుకోవాలన్నారు. లీడర్లు లంకదాసరి లావణ్య,  శ్రీనివాస్ గౌడ్,   పుష్పలత,  ఎండీ అఫ్సర్, కిరణ్, సుశీల, శంకర్,  రాజు, ఐలయ్య,  సదానందం, రాంచంద్రం,  శ్రావణ్, రమేశ్‌‌‌‌‌‌‌‌, నర్సింగ్, రాజయ్య పాల్గొన్నారు. 

 ఎంపీడీవోకు వినతి 

హుజూరాబాద్ రూరల్, వెలుగు: దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఫండ్స్‌‌‌‌‌‌‌‌ వెంటనే మంజూరు చేయాలని కోరుతూ ధర్మసమాజ్ పార్టీ నాయకులు మంగళవారం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండో విడత డబ్బుల కోసం లబ్ధిదారులు రెండేండ్లుగా ఎదురుచూస్తున్నారని, ఈ విషయంలో కాలయాపన చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి శ్రీకాంత్, లీడర్లు రాకేశ్‌‌‌‌‌‌‌‌, రాజు, శ్రీనివాస్, సదానందం, అశోక్, శ్రీనివాస్, సందీప్, సాగర్, అనిల్  పాల్గొన్నారు.