అధికారంలోకి రాగానే మానేరుపై బ్రిడ్జి నిర్మిస్తాం: కవ్వంపల్లి సత్యనారాయణ

గన్నేరువరం, వెలుగు:  స్థానికేతరుడైన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌‌‌‌కు రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం గన్నేరువరం  మండలం చొక్కారావుపల్లె లో పార్టీ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రసమయి దళితులకు చేసింది శూన్యమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మానేరు డ్యాం పై బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లీడర్లు ఉపేందర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అనంతరెడ్డి, దామోదర్, సునీల్, అనిల్, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.