కాంగ్రెస్‌ హామీలు నీటిమూటలు : జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు:  కాంగ్రెస్‌ హామీలు నీటి మూటలని, వాళ్లు అధికారంలోకి వచ్చేది లేదు.. అమలు చేసేది లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. బుధవారం సూర్యాపేటలోని సుమంగళి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు పర్యాయపదం సీఎం కేసీఆర్‌‌ అని, దేశంలో మేనిఫెస్టోని 100 శాతం అమలు చేసిన ఎకైక పార్టీ అని స్పష్టం చేశారు.

 ఎన్నికల యుద్ధానికి బీఆర్ఎస్ సైనికులు సిద్ధం కావాలని, కేసీఆర్‌‌కు వ్యతిరేకంగా ఏకమవుతున్న పార్టీల కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.  గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనివి కూడా నెరవేర్చామని, గడపగడపకు పార్టీ మేనిఫెస్టోని తీసుకెళ్లాలని సూచించారు.  కరెంట్‌ కోతల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేతలు.. ముందు కర్నాటకలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలన్నారు. అక్కడ విద్యుత్‌ సరఫరా లేక  రైతులు రోడ్డెక్కుతున్నారని, తెలంగాణలో 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి తనకు అవకాశం ఇస్తే జిల్లాను మరింత అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. 

ALS0 READ: ఖమ్మంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: పొంగులేటి ప్రసాద్ రెడ్డి