పెద్దపల్లి, వెలుగు: గిట్టుబాటు ధర కోసం ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కాంగ్రెస్ నాయకులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్ల బండ్లను రోడ్డుకు అడ్డంగా నిలిపి నిరసన తెలిపారు.
అనంతరం లీడర్లు మాట్లాడుతూ మూడు రోజులుగా ఢిల్లీలో జాతీయ రైతు సంఘాల ఆధ్వర్యంలో పంటలకు గిట్టుబాటు ప్రకటించాలని రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో లీడర్లు గుండేటి ఐలయ్య యాదవ్ , గోపు నారాయణరెడ్డి, కసరపు ఐలయ్య , రామస్వామి, రాజయ్య గౌడ్, శ్రీనివాస్, మహేశ్ , శ్రీకాంత్, ఐలయ్య , పున్నారెడ్డి , లింగయ్య పాల్గొన్నారు.