ములుగు, వెలుగు: ములుగు కాంగ్రెస్అభ్యర్థి, ఎమ్మెల్యే సీతక్క ఫొటోను ఈవీఎంలు, బ్యాలెట్పేపర్లపై చిన్నగా ముద్రిస్తున్నారని కాంగ్రెస్నేతలు ఆరోపించారు. సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, ఐటీడీఏ పీఓ అంకిత్ ఆఫీస్ ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ మాట్లాడుతూ.. మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, సీతక్క ఫొటో చిన్నదిగా ముద్రించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల అధికారులు బీఆర్ఎస్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న రిటర్నింగ్ ఆఫీసర్అంకిత్ కాంగ్రెస్ లీడర్లతో మాట్లాడారు. ఫొటోను సరిచేసి ముద్రిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ధర్నాలో కాంగ్రెస్ లీడర్లు రవళిరెడ్డి, చాంద్ పాషా, చింత నిప్పుల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.