- కోడె మొక్కులతో కాంగ్రెస్ నిరసన
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న సన్నిధిలో ఇచ్చిన మాట తప్పారని.. ఆయనకు జ్ఞానోదయం కల్గించాలని వేడుకుంటూ కాంగ్రెస్ నాయకులు సోమవారం నిరసన తెలిపారు. డీసీసీ ప్రెసిడెంట్ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న ఆలయాభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి సీఎం మాట తప్పారని ఆరోపించారు. సీఎం మనసు మారాలని రాజన్నకు 8 కోడెల మొక్కులు చెల్లించినట్లు చెప్పారు. ఆలయాభివృద్ది పేరిట రాజన్న గుడి చెరువు పూడ్చివేశారే తప్ప మరేమీ చేయలేదన్నారు. మిడ్మానేరు ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసితులకు ఇండ్ల నిర్మాణానికి రూ. 5.04లక్షలు ఇస్తానని గుడి సాక్షిగా చెప్పి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో లీడర్లు శ్రీనివాస్ గౌడ్, రమేశ్, కొమురయ్య, రాకేశ్, కనకయ్య, ప్రభాకర్ రెడ్డి, లింగయ్య, విష్ణు, తిరుపతి, ఆగయ్య, పరశురాములు పాల్గొన్నారు.