అకౌంట్లు ఫ్రీజ్​పై కాంగ్రెస్​ నిరసన

పరకాల, వెలుగు : పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్​  ను దెబ్బతీయాలనే కుట్రతోనే కేంద్రంలోని బీజేపీ   కాంగ్రెస్​ అకౌంట్లను ఫ్రీజ్​ చేసిందని మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి ఆరోపించారు.  శనివారం బస్టాండ్​ సెంటర్​లో పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్​ ఆధ్వర్యంలో ర్యాలీ

ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న కుట్రను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు.