- సస్పెన్షన్ ఎత్తివేయాలని నేతల డిమాండ్
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు
మంచిర్యాల/ఆదిలాబాద్‌టౌన్/నిర్మల్, వెలుగు: పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీల ఎంపీలను సస్పెండ్చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్‌లో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీల ఎంపీల పట్ల అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎంపీల సస్పెన్షన్‌ను ఖండించారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ ఎన్టీఆర్ చౌక్‌లో..
లోక్‌సభలో ఎంపీలను సస్పెన్స్ చేయడం అప్రజాస్వామికమని బీజేపీ ప్రభుత్వం ప్రతి పక్షాల గొంతునొక్కే చర్యను మానుకోవాలని కాంగ్రెస్ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ‘సేవ్ ఇండియా’ అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులు బోరంచు శ్రీకాంత్ రెడ్డి, గిమ్మ సంతోష్, దామోదర్ రెడ్డి, నగేశ్, కందుల సుఖేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్డీఓ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా
ప్రతిపక్షాల ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఏఓకు వినతిపత్రం అందించారు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 143 మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటును సొంత పార్టీ ఆఫీసుగా వాడుకుంటోందని ఆరోపించారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ నాయకులు జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, గాజుల రవికుమార్, వాజిద్ ఖాన్, ఎంబడి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.