కరీంనగర్ జిల్లాలో ఎంపీల సస్పెన్షన్​పై కాంగ్రెస్ నిరసన 

  •     ఉమ్మడి జిల్లాలో శ్రేణుల ఆందోళన 

కరీంనగర్, మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా కూటమి ఎంపీలను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్​శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇందిరాచౌక్ వద్ద కాంగ్రెస్, సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల బెలూన్లు ప్రదర్శించి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ జాతీయ సమితి సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్మోక్ బాంబులు వేసిన ఘటనపై హోంమంత్రి ప్రకటన చేయాలని ఇండియా కూటమి ఎంపీలు ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి శ్రీనివాస

సిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వైద్యుల అంజన్ కుమార్, రహమత్ హుస్సేన్, లీడర్లు​పాల్గొన్నారు. మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో యువజన కాంగ్రెస్ నాయకుల నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. 

బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు

సిరిసిల్ల టౌన్, వెలుగు : నిరంకుశ బీజేపీకి రాబోయే లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ లీడర్లు ధర్నా చేశారు 

కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది 

జగిత్యాల టౌన్, వెలుగు : పార్లమెంటుపై దాడిని నిలదీస్తే కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీవో ఆఫీస్​ఎదుట కాంగ్రెస్ అధ్యక్షుడు విప్ అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ లో ఎమర్జెన్సీ తలపిస్తుందని మండిపడ్డారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి  మొదట్లో ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే అద్వానీ కృషి చేశారని, ఆయనకు దక్కాల్సిన గౌరవం వేరేవరికో దక్కుతుందని మండిపడ్డారు. కార్యక్రమంలో లీడర్లు నాగభూషణం, దుర్గయ్య, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.