బహిరంగ సభను సక్సెస్ చేయాలి

బహిరంగ సభను సక్సెస్ చేయాలి

తుంగతుర్తి, వెలుగు : ఈనెల 16న జరిగే కాంగ్రెస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని వ్యవసాయ కమిషన్ సభ్యుడు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం తుంగతుర్తి మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్ద కాలంగా గత ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణను చేపట్టడంలో విఫలమయ్యాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రెండింటిని అమలు చేస్తున్నందుకు కృతజ్ఞత పూర్వక బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

 ఈ సభకు జిల్లా ఇన్​చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే, ఎంపీ హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గీతారెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుడిపాటి సైదులు, దొంగరి గోవర్ధన్, వెంకన్న, రాంబాబు పాల్గొన్నారు.