కాంగ్రెస్ను వీడిన మరో ఎమ్మెల్యే

ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే అదితీ సింగ్ కాంగ్రెస్ ను వీడారు. పార్టీ చీఫ్ సోనియా గాంధీ నియోజకవర్గమైన రాయ్ బరేలీ ఎమ్మెల్యే అయిన అదితీ.. కాంగ్రెస్ ను వీడి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సోనియా గాంధీకి లెటర్ రాశారు. కాగా, రెండు నెలల నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న అదితీ.. ఈరోజు సోనియాకు లెటర్ రాయడంతో రాజీనామాపై స్పష్టత వచ్చింది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ అదితీని పార్టీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించినట్లు సమాచారం. దీంతో ఆమె పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి వైదొలిగారని తెలుస్తోంది. 

మరిన్ని వార్తల కోసం: 

భారత యువకుడ్ని కిడ్నాప్ చేసిన చైనా

6 నెలలకే యాంటీబాడీలు మాయం

రాజులు మెచ్చిన గాజుల షాప్