న్యూఢిల్లీ: రైతులే మన దేశానికి బలం అని, వాళ్ల అభిప్రాయాలను అర్థం చేసుకుంటే దేశంలోని అనేక సమస్యలు పరిష్కారమవుతాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ ఈ నెల 8న హర్యానా సోనేపట్‌లోని మదీనా గ్రామంలో పంట పొలాలను సందర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇండియాకు రైతులే బలం అని ట్వీట్ చేశారు.
ALSO READ :సూసైడ్స్ పెరుగుతున్నయ్.. కనించని రౌండ్ ది క్లాక్ నిఘా
‘‘మన రైతులు నిజాయితీపరులు, తెలివైనోళ్లు. వాళ్లకు పని చేసుడు తెలుసు, హక్కుల కోసం కొట్లాడటమూ తెలుసు. అవసరమైనప్పుడు మద్దతు ధరకోసం పోరాడుతరు. అనవసరమైన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిలబడ్తరు. వాళ్ల మాటలు వింటే, అర్థం చేసుకుంటే దేశంలోని అనేక సమస్యలను పరిష్కరించవచ్చు. దేశంలోని ప్రతిఒక్కరి నోటికి అందే ముద్ద.. వాళ్లు కష్టపడి పండించే ధాన్యంలోనిదే. కానీ, రైతు కష్టానికి తగిన ఫలితం మాత్రం లభించట్లేదు”అని రాహుల్ పేర్కొన్నారు.