కాంగ్రెస్ పై నగ్మా అసంతృప్తి

కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రాజ్యసభ జాబితాపై నటి, పార్టీ సీనియర్ లీడర్ నగ్మా అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాలుగా పార్టీలో ఉన్నా.. తాను అర్హురాలిని కాదా ? అంటూ ప్రశ్నించారు. పార్టీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 10 మందితో ఉన్న ఈ జాబితాపై నగ్మా అసంతృప్తి వ్యక్తం  చేస్తూ ఆమె ట్వీట్స్ చేశారు. మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్ ప్రతాప్​ గర్హికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారన్నారు.  తన 18 ఏళ్ల తపస్సులో లోటుందేమోనని నగ్మా ట్వీట్ లో తెలిపారు. మే 30వ తేదీ సోమవారం మరో ట్వీట్ చేశారామె. 2003/2004లో కాంగ్రెస్ లో చేరిన సమయంలో.. తనకు రాజ్యసభ సీటు ఇస్తానని సోనియా గాంధీ హామీనిచ్చారని తెలిపారు. ఆమె ఆదేశాల ప్రకారం తాను కాంగ్రెస్ లో చేరడం జరిగిందన్నారు. కానీ ఆ సమయంలో తమ పార్టీ అధికారంలో లేదనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
 

ఇప్పటికీ 18 ఏళ్లు గడిచాయని, రాజ్యసభ సీటుకు తాను అర్హురాలిని కాదా ? అని ప్రశ్నించారు. 2004లో పార్టీలో చేరాలని బీజేపీ ఆఫర్ ఇచ్చింది. 2004 లోక్ సభ ఎన్నికల సమయంలో హైదరాబాద్ స్థానం నుంచి నగ్మాను బరిలోకి దింపాలని బీజేపీ యోచించింది.  కానీ.. నగ్మా  అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరారు. జమ్మూ కశ్మీర్, లడఖ్, పుదుచ్చేరి మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతుండడంతో పాటు.. ముంబాయిలోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. మరి నగ్మా ట్వీట్స్ తో కాంగ్రస్ హై కమాండ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

మరిన్ని వార్తల కోసం :-
సుప్రియాకు క్షమాపణలు చెప్పిన చంద్రకాంత్


రాజ్యసభకు చిదంబరం.. ఆజాద్‌‌కు నో ఛాన్స్!