తుంగతుర్తి, వెలుగు : ఈనెల 27న తిరుమలగిరి మండల కేంద్రంలో నిర్వహించనున్న కాంగ్రెస్ ర్యాలీని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మందుల సామేల్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి బూత్ నుంచి 200 మందికిపైగా కార్యకర్తలను సమీకరించి ర్యాలీకి తరలించాలని సూచించారు.
కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలకుర్తి రాజయ్య, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ శాగంటి అనసూయ, నాయకులు నరేశ్, కొండల్ రెడ్డి జనార్దన్, వీరశేఖర్, జమీలాల్, కందుకూరు అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.