ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

గోదావరిఖని, వెలుగు :  సీఎం కేసీఆర్, ఆయన మంత్రులు అబద్ధాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ రామగుండం నియోజకవర్గ ఇన్​చార్జి ఎం ఎస్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌ విమర్శించారు. ఆదివారం అంతర్గాం మండల కేంద్రంలో  వడ్డెర  సంఘం రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు ఒల్లెపు సాయికుమార్‌‌‌‌‌‌‌‌తో పాటు 150  మంది యువకులు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ దళిత బంధు స్కీం  టీఆర్ఎస్ బంధువు స్కీమ్​గా మారిందన్నారు. అర్హులైన వారిని పక్కన పెట్టి టీఆర్ఎస్​కార్యకర్తలకు ఇస్తున్నారన్నారు. అంతకు ముందు పెద్దంపేట నుంచి అంతర్గాం వరకు బైక్​ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లీడర్లు మెరుగు పోచయ్య, పెండ్యాల మహేశ్,  రాజలింగం,  కిరణ్ కుమార్,   తిరుపతి,  బాపు పాల్గొన్నారు.

బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

జగిత్యాల రూరల్/రామడుగు, వెలుగు:  పీఎం మోడీ బర్త్​డే సందర్భంగా నిర్వహిస్తున్న  ‘సేవాపక్షం’ లో భాగంగా ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ భారత్’  నిర్వహించామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పైడిపెల్లి సత్యనారాయణ రావు  చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని  పిలుపు మేరకు గ్రామాలను, పట్టణాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు వీరబత్తిని అనిల్ ప్రధాన కార్యదర్శులు ఆముద రాజు, సిరికొండ రాజన్న తదితరులు పాల్గొన్నారు.

రామడుగులో..

మండలంలోని దేశరాజుపల్లి గ్రామంలో శక్తి కేంద్ర ఇన్​చార్జిలు ఉప్పు రాంకిషన్ ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి , స్వచ్ఛభారత్​ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం గ్రామంలోని సీతారామచంద్ర స్వామి గుడి ఆవరణలో, బూత్​ కేంద్రాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు.

స్కూళ్లకు అవార్డులు వచ్చేలా కృషి చేయాలి

కరీంనగర్‍ సిటీ, వెలుగు: జిల్లాలోని అన్ని గవర్నమెంట్​స్కూళ్లు ‘స్వచ్ఛ విద్యాలయ  పురస్కార్​’ అవార్డులకు ఎంపికయ్యేలా హెడ్మాస్టర్లు కృషి చేయాలని అడిషనల్​కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‍లో జిల్లా స్థాయిలో ఎంపికైన 18 స్కూళ్లకు  సర్టిఫికెట్ ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. స్కూళ్లలో టాయిలెట్స్, వాటర్,  హ్యాండ్ వాష్ విషయంలో ఫైవ్​స్టార్ రేటింగ్ వచ్చే  విధంగా చర్యలు తీసుకోవాలని  హెడ్మాస్టర్లకు సూచించారు. డీఈవో సీహెచ్​రాంబాబు,  , ఎస్ జనార్దన్ రావు, సెక్టోరల్ ఆఫీసర్లు అశోక్ రెడ్డి, ఆంజనేయులు, కరీంనగర్ ఎంఈవో వేణు కుమార్  పాల్గొన్నారు.

ఒద్యారం స్కూల్​కు స్వచ్ఛ విద్యాలయ పురస్కారం

గంగాధర, వెలుగు : మండలంలోని ఒద్యారం హైస్కూల్​కు ‘స్వచ్ఛ విద్యాలయ పురస్కారం’ దక్కింది.  ఆదివారం అడిషనల్​ కలెక్టర్​ గరిమా అగర్వాల్​ హెడ్మాస్టర్ ​ఏనుగు ప్రభాకర్​రావు కు  సర్టిఫికెట్​అందజేశారు. స్వచ్ఛ విద్యాలయం జిల్లాస్థాయి కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచినట్లు హెడ్మాస్టర్​తెలిపారు.

కేసీఆర్​కు సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదు

జగిత్యాల, వెలుగు: ఏ స్థానికత కోసం తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారో.. అదే స్థానికతను తుంగలో తొక్కిన సీఎం కేసీఆర్ కు సీఎం పదవిలో  కొనసాగే నైతిక హక్కు లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో పలువురు ఇంజినీరింగ్​గ్రాడ్యుయేట్స్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా జీవన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీవన్​రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో  యూనివర్సిటీలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, ప్రైవేట్​యూనివర్సిటీల్లో 25 శాతం సీట్లకు మాత్రమే రిజర్వేషన్  వర్తిస్తోందని,  మిగతా  75 శాతం సీట్లను  అమ్మకానికి పెడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ మెంబర్​గిరి నాగ భూషణం, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు  మృతి

బోయినపల్లి, వెలుగు : మండల పరిధిలోని కొదురుపాక బ్రిడ్జి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్​ మండలం నల్లగొండ గ్రామానికి చెందిన ఎడవెల్లి బాలయ్య(60) , కవ్వంపల్లి కొమురయ్య  ఆదివారం సిరిసిల్ల నుంచి కరీంనగర్​ వైపు బైక్​పై వెళ్తుండగా కొదురుపాక వద్ద మిడ్​మానేరు బ్రిడ్జి దాటగానే వెనుక నుంచి కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్​వెళ్తూ వారి బైక్​ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బాలయ్య స్పాట్​లోనే చనిపోగా, కొమురయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 లో కరీంనగర్​ప్రభుత్వ ఆస్పత్రికి  తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డెడ్​బాడీని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

కాలువపై బ్రిడ్జి కట్టాలని రైతు రోదన దీక్ష

రామడుగు, వెలుగు: కాలువలపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్​చేస్తూ వైఎస్సార్​టీపీ  నాయకులు రామడుగు మండలం తిరుమలాపూర్ గ్రామంలో ఆదివారం రైతు రోదన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్​చార్జి సత్యరాజ్ వర్మ మాట్లాడుతూ 18 ఏండ్లుగా రైతులకు సరైన రోడ్లు లేక బ్రిడ్జి నిర్మాణం కాక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల్లో మెరుగైన వైద్యసేవలు

జ్యోతినగర్, వెలుగు: రామగుండం ఎన్టీపీసీ ప్రభావిత  గ్రామాల్లో మెరుగైన వైద్యసేవలందించేందుకు కృషి చేస్తున్నామని  ప్రాజెక్ట్​ సీజీఎం సునీల్​కుమార్ చెప్పారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని  ఆదివారం గ్రామాల్లో ఎంసీహెచ్​ వైద్య సేవలందించేందుకు మొబైల్ మెడికల్ యూనిట్ ను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ సీఎస్​ఆర్, సీడీ లో భాగంగా ధన్వంతరి హాస్పిటల్​ బృందంతో కలిసి ప్రజలకు మెరుగైన వైద్య 
సేవలందించడం  మంచి పరిణామమని చెప్పారు. ​సీఎస్​ఆర్​ డీజీఎం త్రివేడియం, ధన్వంతరి హాస్పిటల్ సీఈవో ఇత్వారీ రామ్ లాహిరి, వైద్యాధికారులు ఉన్నారు. 

ఆత్మీయ సమ్మేళనం

కరీంనగర్‍ సిటీ, వెలుగు: మలేషియా తెలుగు సంఘం ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నగరంలో  మ్యూజిక్ ​డైరెక్టర్ ​కేబీ శర్మ ఆధ్వర్యంలో  ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్​ గెస్ట్​గా  కరీంనగర్ అడిషనల్​ కలెక్టర్ ​జీవీ శ్యాంప్రసాద్ లాల్‍ హాజరు కాగా  కళా నిలయం అధ్యక్షుడు  శ్రీనివాసచారి,  మలేషియా ప్రతినిధులు పరంధామ,    రేవతి, సత్యా రావు,  పాల్గొన్నారు.

నూకలమర్రికి డీఎస్​పీ పాదయాత్ర

వేములవాడ రూరల్, వెలుగు : దళిత శక్తి ప్రోగ్రాం(డీఎస్​పీ) అధ్యక్షుడు డా.విశారదన్​ మహరాజ్​10 వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ఆదివారం రాత్రి వేములవాడ రూరల్​ మండలంలోని చెక్కపల్లి మీదుగా నూకలమర్రి గ్రామానికి చేరుకుంది. నూకల మర్రిలో విశారదన్​ మహారాజ్​ డీఎస్​పీ జెండా ఆవిష్కరించి గ్రామస్తులతో మాట్లాడారు.

వంద శాతం పోస్టల్​ బ్యాంక్​ ఖాతాలు తెరవాలి

కరీంనగర్‍ సిటీ, వెలుగు: గ్రామాల్లో వందశాతం పోస్టల్ బ్యాంకు అకౌంట్లు ఓపెన్​ చేసేలా, డిజిటల్​ లావాదేవీలు అలవాటు చేసుకునేలా ఆఫీసర్లు కృషి చేయాలని కలెక్టర్​ ఆర్​వి కర్ణన్​ ఆదేశించారు. ఆదివారం మహాత్మగాంధీ జయంతి సందర్భంగా  కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామంలోని ప్రైమరీ స్కూల్​లో  ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. కలెక్టర్ ముందుగా గాంధీజీ ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు.  అనంతరం మాట్లాడుతూ  గ్రామంలో మెరుగైన సౌలత్​లు కల్పించేందుకు అధికారులు, ప్రజా ప్రతి నిధులు కృషి చేయాలన్నారు. నగునూరు గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని యూబీఐ బ్యాంక్ ఆఫీసర్లను కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ వారు అందించిన కంపాస్  బాక్సులను స్టూడెంట్లకు కలెక్టర్ పంపిణీ  చేశారు. సర్పంచ్ ఉప్పల శ్రీధర్,  ఎంపీటీసీలు  పాల్గొన్నారు.