ఎమ్మెల్యే వివేక్, ఎంపీ ఫొటోలకు కాంగ్రెస్​ శ్రేణులు క్షీరాభిషేకం

ఎమ్మెల్యే వివేక్, ఎంపీ ఫొటోలకు కాంగ్రెస్​ శ్రేణులు క్షీరాభిషేకం
  • వారి చొరవతోనే రైల్వే ఫ్లైఓవర్​నిర్మాణం పూర్తి
  • కాంగ్రెస్​ నేతల సంబురాలు

కోల్ బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద రైల్వే ఫ్లైఓవర్​నిర్మాణానికి కృషి చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటోలకు కాంగ్రెస్​ శ్రేణులు క్షీరాభిషేకం చేశారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆదివారం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ లీడర్లు మాట్లాడుతూ.. పెద్దపల్లి ఎంపీగా వివేక్​ వెంకటస్వామి కొనసాగిన కాలంలో ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని సాంక్షన్​ చేయించారన్నారు. కానీ పదేండ్లు కాలంలో బీఆర్ఎస్ ​పాలకుల నిర్లక్ష్యంతో బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు పూర్తిచేయించకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారన్నారు. గేటు వద్ద  ప్రమాదాలు జరిగి పలువురు చనిపోయారన్నారు.

 ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి, ఎంపీగా వంశీకృష్ణ గెలిచిన వెంటనే ఫ్లైఓవర్​ బ్రిడ్జి పనులను పూర్తి చేయించి ప్రజల కష్టాలను దూరం చేశారన్నారు. దీన్ని జీర్ణించుకోలేని బీఆర్​ఎస్​ లీడర్లు తామే బ్రిడ్జిని పూర్తి చేశామంటూ తప్పుడు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్​ టౌన్ ప్రెసిడెంట్​పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, మున్సిపల్ ​మాజీ చైర్మన్​ జంగం కళ, లీడర్లు అబ్దుల్​అజీజ్, గాండ్ల సమ్మయ్య, మాజీ జడ్పీటీసీ యాకుబ్​ అలీ, మెట్ట సుధాకర, గోపతి బానేశ్, కల్యాణ్, రాజం తదితరులు పాల్గొన్నారు.