కాంగ్రెస్ ముందస్తు సంబురాలు

కరీంనగర్ సిటీ, వెలుగు:  ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి  అనుకూలంగా రావడంతో కాంగ్రెస్​శ్రేణులు ముందస్తు సంబురాలు నిర్వహించారు. ఇందిరా చౌక్‌లో పటాకులు పేల్చి  వేడుకలు జరుపుకున్నారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్, నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి  మాట్లాడుతూ కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీతో రాష్ట్రంలో అధికారం చేపట్టబోతున్నట్లు ఎగ్జిట్​పోల్స్​ప్రకటించాయన్నారు. 

నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలగబోతుందన్నారు. కార్యక్రమంలో లీడర్లు సమ్మద్ నవాబ్, రహ్మత్ హుస్సేన్, ఎస్. కె. సిరాజ్ హుస్సేన్, రాంచందర్, అరుణ్ కుమార్, భాస్కర్  
పాల్గొన్నారు.