వంశీకృష్ణకు టికెట్ ​దక్కడంపై ..కాంగ్రెస్​ శ్రేణుల సంబురాలు

ఆదిలాబాద్​నెట్​వర్క్, వెలుగు: కాంగ్రెస్​అధిష్టానం పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను ప్రకటించడంపై శుక్రవారం కాంగ్రెస్​నేతలు సంబురాలు చేసుకున్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్​సూపర్​బజార్​చౌరస్తాలోని కాంగ్రెస్,​ అనుబంధ సంఘాల లీడర్లు, కార్యకర్తలు టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఎన్నికల్లో వంశీకృష్ణను భారీ మోజార్టీతో గెలుపిస్తామని లీడర్లు పేర్కొన్నారు. 

టీపీసీసీ జనరల్​సెక్రటరీ రాఘునాథ్​రెడ్డి, మున్సిపల్ చైర్​పర్సన్ జంగం కళ, వైస్​చైర్మన్​సాగర్​రెడ్డి, కాంగ్రెస్ టౌన్​ప్రెసిడెంట్​పల్లె రాజు, లీడర్లు గోపతి రాజయ్య, ఎండీ అబ్దుల్​అజీజ్, శ్రీనివాస్, శ్యాంగౌడ్, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. మందమర్రి పాత బస్టాండ్​ఏరియాలో కాంగ్రెస్​ సీనియర్​లీడర్ సొత్కు సుదర్శన్, ఎండీ జమీల్, మంకు రమేశ్, ఎండీ సుకూర్, వేటూరి సత్యనారాయణ, ఆలం శంకర్,  శ్రీనివాస్ తదితరులు టపాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. భీమారం మండల కేంద్రంతోపాటు ఇందారం, టేకుమట్ల గ్రామాల్లో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అభిమానులు, కాంగ్రెస్ లీడర్లు సంబురాలు జరుపుకున్నారు. 

మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫయాజ్ లీడర్లు రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, చల్ల సత్యనారాయణ రెడ్డి, నాగ రాజు, పొడేటి రవి, భూక్య లక్ష్మణ్, ప్రకాశ్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు పట్టణ కేంద్రంలో హస్తం పార్టీ లీడర్లు పటాకులు కాల్చారు. హేమంత రెడ్డి, చెన్న సూర్యనారాయణ, మహేశ్ తివారి, సుశీల్ కుమార్, చింతల శ్రీనివాస్, మల్లిక్, కాంగ్రెస్ పార్టీ చెన్నూర్​అధ్యక్షులు జాడి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. 

దేశ ప్రదానిగా రాహుల్ గాంధీ, పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపును ఎవరూ ఆపలేరని బెల్లంపల్లి యువజన కాంగ్రెస్ లీడర్లు పేర్కొన్నారు. బెల్లంపల్లిలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ సర్వసభ సమావేశం నిర్వహించి అధ్యక్షుడు ముడిమడుగుల మహేందర్ మాట్లాడారు. వంశీకృష్ణను ఎంపీగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రావణ్ భోగ, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమంత్, మండలాల అధ్యక్షులు భరత్, రాకేశ్, రమేశ్​తదితరులు పాల్గొన్నారు.