కాంగ్రెస్ నుంచి బయటకి వెళ్లి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ స్టేట్ చీఫ్ డీకే శివకుమార్ వారిని సొంతగూటికి రప్పించాలని చూస్తున్నారు. వారితో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
అయిదుగురు రెబల్స్‌తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. మత రాజకీయాలు కర్ణాటకలో పని చేయవని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణే ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ అని శివకుమార్ అన్నారు. బీజేపీకి ప్రజలు గుణపాఠం చెబుతున్నారన్నారు. సొంతంగానే అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.