నల్గొండ, వెలుగు : చండూరు మండలం ఇడికుడలో కాంగ్రెస్అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంట్లో శుక్రవారం పార్టీ మ్యానిఫెస్టో రిలీ జ్ చేశారు. ఎన్నికల ఇన్చార్జి ఆర్ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్రవంతి మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే నియోజకవర్గంలోని పెండింగ్సమస్యలతోపాటు, అన్ని వర్గాల సంక్షేమానికి పాటు పడతానన్నారు. చండూరు రెవెన్యూ డివిజన్ గురించి పోరాటం చేస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. భూనిర్వాసితుల విషయంలో రాజగోపాల్ రెడ్డి శ్రద్ధ చూపలేదని, ముదిరాజ్ లను బీసీ ఏ లో చేర్చాలని డిమాండ్ చేశారు. మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలయ్యేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని దామోదర్‌రెడ్డి తెలిపారు.
మ్యానిఫెస్టోలో ముఖ్యాంశాలు..
- ఎస్ఎల్బీసీ టన్నెల్, చర్లగూడెం, డిండి, ఉదయ సముద్రం, కిష్టరాయపల్లి, ఏదుల రిజర్వాయర్లు పూర్తయ్యేలా పోరాటం.
- 9 నిత్యావసర సరుకులను చౌకగా అందించే అమ్మహస్త పథకం రీ ఓపెన్.
- రిజర్వాయర్లు, ప్రాజెక్టులకు కింద ముంపుకు గురవుతున్న బాధితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీతోపాటు ఎకరాకు రూ.25 లక్షల నష్ట పరిహారం ఇప్పించడం.
- పోడు భూముల పై గిరిజనులకు కాంగ్రెస్ కల్పించిన హక్కులను పునరుద్ధరించడం.
- జవహర్లాల్ నెహ్రూ స్కిల్డెవలప్మెంట్సెంటర్ల ఏర్పాటు. మండలానికో సమగ్ర విద్యా కేంద్రం. నారాయాణ్పూర్, చౌటుప్పుల్‌లో పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు. గట్టుప్పుల్లో 30 పడకల పీహెచ్సీ కేంద్రం.
- మర్రిగూడ, చండూరు పీహెచ్‌సీలను 50 పడకల దవాఖానాలుగా మార్చడంతో పాటు డయాలిసిస్ కేంద్రాలు నెలకొల్పడం. మునుగోడు మండలంలో మాతాశిశు కేంద్రం.
- నేతన్నల కోసం పుట్టపాకలో హ్యాండ్లూమ్ పార్కు. నూలు పై సబ్సిడీ.
- పాడైపోయిన రోడ్లను బాగు చేయడం. కొత్త రోడ్లు వేయడం. చౌటుప్పుల్ పరిధిలో మురుగు నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు. ప్రతి గ్రామానికి బస్సు. ప్రతి ఇంటికి తాగునీరు.