
కోహెడ(బెజ్జంకి)వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కరెంట్ కోతలు తప్పవని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. సోమవారం బెజ్జంకి రైతు వేదికలో రేవంత్‌రెడ్డి 3 గంటల కరెంట్‌పై మాట్లాడిన తీరుకు వ్యతిరేకంగా రైతులతో తీర్మానం చేయించారు. అనంతం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లో పని చేస్తున్నరని ఆరోపించారు.
ALSO READ :ట్రాఫిక్ జామ్తో నరకయాతన.. గంటల కొద్ది రోడ్లపైనే వాహనాలు
సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్‌తో పాటు సాగు నీరు ఇస్తుంటే ఇది చూడని కాంగ్రెస్ నాయకులకు కండ్లు మండుతున్నయని మండిపడ్డారు. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబును ప్రజలు ఏ విధంగా తరిమికొట్టారో కాంగ్రెస్‌కు కూడా అదే గతి పడుతుందని అన్నారు.ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కవిత, పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ఏఎమ్‌సీ చైర్మెన్ చంద్రకళ పాల్గొన్నారు.