రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన కాంగ్రెస్ సర్పంచులు

నల్గొండ : మునుగోడు నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. మండలానికి చెందిన కాంగ్రెస్ సర్పంచ్ లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కమలం పార్టీలో చేరారు. కల్వలపల్లి సర్పంచ్ వంటపాక జగన్, జక్కలవారి గూడెం సర్పంచ్ జక్కల శ్రీను యాదవ్, కిస్టాపురం సర్పంచ్ నందిపాటి రాధా రమేష్ తో పాటు మునుగోడు కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ లింగస్వామి యాదవ్ లకు నల్లగొండ డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాసరెడ్డి సమక్షంలో కండువా కప్పిన రాజగోపాల్ పార్టీలోకి ఆహ్వానించారు. 

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కేడర్ బలోపేతంపై దృష్టి సారించాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీజేపీ పార్టీ ప్రజలతో మమేకమవుతోంది. దీంతో ఇతర పార్టీలకు చెందిన స్థానిక నాయకులు కార్యకర్తలు కమలం పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు.