
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గత పదేళ్లలో చేయని అభివృద్ధి ఇపుడెలా చేస్తారని ప్రశ్నించారు. పదేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ లో చేరాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్తల కృషి ఫలితమన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ అరాచకాలపై చెమటోడ్చి సాధించుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు.
మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి ..ఈ అభివృద్ది మాకు చేత కాదా...నువ్వు మా కన్నా అనుభవంలో గొప్పోడివా? అభివృద్ది అభివృద్ది అంటే మాకు అక్షర్యం కలుగుతుంది. నీ స్వార్ధ ప్రయోజనాలే అభివృద్ధి అనుకుంటే క్షమించు. అభివృద్ధిలో రాష్ట్ర స్థాయిలో పోటీ పడ్డ, నీ లాగా ఒక్క నియోజకవర్గ స్థాయి కాదు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో నా పోటీ. ఆ నాడు ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అభివృద్దిలో పోటీ పడ్డా. అభివృద్ది అంటే నాయకుల స్వార్ధ ప్రయోజనాల కోసం కాదు. ఎవడో వచ్చి కాళ్లల్లో కట్టే అడ్డం పెడితే ఎవరికి బయపడకూడదు, వాళ్ల కంటే మన కాళ్లు బలంగా ఉన్నాయి అని వ్యాఖ్యానించారు జీవన్ రెడ్డి.