అవినీతి గురించి మోడీ మాట్లాడరేం?

హోషియార్పూర్: ప్రధాని మోడీపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు ఫైర్ అయ్యారు. పేదల బ్యాంకు అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తానన్న మోడీ.. ఆ హామీని నెరవేర్చారా అని ప్రశ్నించారు. పంజాబ్ లోని హోషియాపూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని ఎన్నికల సమయంలో మోడీ జీ ప్రతి ప్రసంగంలో చెబుతూ వచ్చారన్నారు. నిరుద్యోగ యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారని.. ఎవరికైనా జాబ్స్ వచ్చాయా, డబ్బులు అందాయా అని ప్రశ్నించారు. ‘అవినీతి, ఉద్యోగాల గురించి మోడీజీ ఎందుకు మాట్లాడరు? ఆయనే డీమానిటైజేషన్ తీసుకొచ్చి జీఎస్టీని విధించారు. దీని వల్ల ఎవరికి ప్రయోజనం కలిగింది?’ అని రాహుల్ క్వశ్చన్ చేశారు.  

ఏడాదికి పైగా పంజాబ్ రైతులు పస్తులు ఉండాల్సి వచ్చిందని రాహుల్ మండిపడ్డారు. ఒకవైపు రైతులు ఆందోళనలు చేస్తుంటే.. మరోవైపు వారి కష్టార్జితాన్ని ఇద్దరు, ముగ్గురు బిలియనీర్లకు కట్టబెట్టడంలో మోడీ జీ బిజీగా ఉన్నారని దుయ్యబట్టారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగగిన ఉద్యమంలో మృతి చెందిన రైతుల కోసం మోడీ .. పార్లమెంట్ లో కనీసం రెండు నిమిషాలు కూడా మౌనం పాటించలేదని విమర్శించారు. చనిపోయిన అన్నదాతల కుటుంబాలకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందలేదని.. కానీ రాజస్థాన్, పంజాబ్ ప్రభుత్వాలు పరిహారం ఇచ్చి ఆదుకున్నాయని వివరించారు.  

మరిన్ని వార్తల కోసం:

భర్త నుంచి విడిపోయిన మరో నటి

శ్రీవారి భక్తులకు శుభవార్త

యూపీలో 300 సీట్లు గెలుస్తాం