కల్వకుంట్ల కోటను బద్దలు కొట్టడానికే యువ పోరాట యాత్ర

  • రాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి

వేములవాడ, వెలుగు: రాష్ట్రంలో కల్వకుంట్ల కోటను బద్దలు కొట్టడానికే కాంగ్రెస్​ యువ పోరాట యాత్ర ప్రారంభించిందని రాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనరెడ్డి అన్నారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన యువ పోరాట యాత్ర  గురువారం వేములవాడ చేరుకుంది. డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్ ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ఎదుట కార్నర్ మీటింగ్ నిర్వహించారు. అంతకుమందు తిప్పపూర్​నుంచి వేములవాడ రాజన్న ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌‌‌‌ను గద్దె దింపితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు.  2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.4వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో జడ్పీటీసీ నాగం కుమార్​, రవీందర్​ రెడ్డి, యూత్​కాంగ్రెస్​లీడర్లు పాల్గొన్నారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులతోనే రాష్ట్రం నడుస్తోంది 

సిరిసిల్ల టౌన్, వెలుగు: తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని సీఎం కేసీఆర్ అన్నారని  కానీ ఆ ప్రాతిపదికనే ఉద్యోగులను నియమించుకుంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని యూత్ కాంగ్రెస్ స్టేట్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. కాంగ్రెస్ యువ పోరాట యాత్రలో భాగంగా సిరిసిల్లలో ఆయన పర్యటించారు. అనంతరం బైక్​ర్యాలీ నిర్వహించారు.