అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు ఆగ్రహానికి గురైతే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. వరి, మొక్క జొన్న పంటలకు మద్దతు ధరగతో పాటుగా రూ.500 బోనస్ ఇవ్వాలని సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు.
రైతుబందు సీలింగ్ తొలగించి రైతుబంధు నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. మామిడి పంటకు తెగులు సోకడంతో దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు ఎమ్మెల్యే సంజయ్. మామిడి రైతులకు ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు. SRSP మీద ఆధారపడి పంటలు సాగు చేసే రైతులకు ఒక్క ఎకరా ఎండకుండా నీటిని సరఫరా చేయాలన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ కి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని సంజయ్ చెప్పారు.