
తుక్కుగూడ విజయ భేరి సభలో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు వరాల జల్లు కురిపించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద ఏడాదికి ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించారు. రైతులతోపాటు కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింప జేస్తామని ప్రకటించారు.
- ALSO READ | కాంగ్రెస్ ప్రకటించిన ఉచిత హామీలు ఇవే
అంతేకాదు.. భూమిలేని నిరుపేదలకు, రైతు కూలీలకు సంవత్సరానికి రూ. 12 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరతోపాటు రూ. 500 అదనంగా ఇస్తామని ప్రకటించారు మల్లికార్జున ఖర్గే..
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు మేం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు మల్లిఖార్జున్ ఖర్గే..