మీడియా అంటే భయపడే మోదీ.. పాడ్కాస్ట్లో నీతులు చెప్పడం విడ్డూరం: కాంగ్రెస్

మీడియా అంటే భయపడే మోదీ.. పాడ్కాస్ట్లో నీతులు చెప్పడం విడ్డూరం: కాంగ్రెస్

ప్రధాని నరేంద్ర మోదీ పాడ్ కాస్ట్ లో చర్చించిన వివిధ అంశాలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శించింది. దేశంలో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరకాని మోదీ పాడ్ కాస్ట్ లో కూర్చొని నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ నేత జైరాంరమేష్ అన్నారు. ప్రెస్, మీడియా అంటే మోదీకి భయం అని.. అందుకే ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఎదుర్కోలేదని విమర్శించారు. జర్నలిస్టులకు సమాధానం చెప్పలేని మోదీ.. కంప్యూటర్ సైంటిస్ట్ లెక్స్ ఫ్రిడ్ మన్ పాడ్ కాస్ట్ కు హాజరుకావడం విడ్డూరం అని అన్నారు. 

Also Read:-తల్లిదండ్రులను వదిలేస్తే..ఆస్తి బదిలీ రద్దు..

‘‘విమర్శలే ప్రజాస్వామ్యానికి ఆత్మ’’ అని మోదీ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జైరాం రమేష్. దేశంలో మీడియాను గుప్పెట్లో పెట్టుకుని, జర్నలిస్టుల గొంతు నొక్కుతూ విమర్శ గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు. అన్ని సంస్థలను గుప్పెట్లో పెట్టుకుని, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టించే మోదీ.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని అన్నారు. 

ప్రతిపక్షాలను అణచివేసేందుకు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్న మోదీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు.