తనపై ఆరోపణలకు ఆధారాలు చూపాలని దీపాదాస్మున్షీ డిమాండ్
రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలి
రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక
హైదరాబాద్: బీజేపీ నాయకుడు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌కు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ లీగల్ నోటీసులు పంపారు. ఇటీవల దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ నాయకుల నుంచి బెంజ్ కారు లబ్ది పొందినట్లు ప్రభాకర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేశారని ఆమె ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి.. రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించకపోతే రూ.10కోట్లకు పరువు నష్టం దావా చేయనున్నట్లు దీపాదాస్ మున్షీ హెచ్చరించారు.