ఓట్ల మీదున్న ప్రేమ రైతుల మీద లేదు : అన్వేశ్​రెడ్డి

నందిపేట, వెలుగు: జిల్లా మంత్రి ప్రశాంత్​రెడ్డి, ఆర్మూర్​ఎమ్మెల్యే జీవన్​రెడ్డిలకు ఓట్ల మీదున్న ప్రేమ, రైతుల మీద లేదని తెలంగాణ కిసాన్​కాంగ్రెస్ చైర్మన్​అన్వేశ్​రెడ్డి విమర్శించారు. మొక్కజొన్న, సోయా పంటలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ సోమవారం నందిపేటలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి అంటే కుక్కర్లు, చీరలు పంచిపెట్టడం కాదని, నలుగురికి అన్నం పెట్టే రైతుల బాగు గురించి ఆలోచించడమన్నారు. రెండు రోజుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ఆర్మూర్​కేంద్రంగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. జిల్లా కిసాన్ ​కాంగ్రెస్​చైర్మన్​ముప్ప గంగారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మంద మహిపాల్, జిల్లా ఉపాధ్యక్షులు పెంట ఇంద్రుడు, గంగాధర్, భూమేశ్​రెడ్డి, శ్రీను పాల్గొన్నారు.