తెలంగాణకు బూతు నేర్పిందే కేసీఆరే : రఘు

  •     ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ రఘు

షాద్​నగర్,వెలుగు : రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తుంటే, ఓర్వలేక ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​ను బట్టలూడదీసి కొడతామని ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కో – ఆర్డినేటర్ పి. రఘు హెచ్చరించారు. తెలంగాణకు బూతు మాటలు, పదాలు నేర్పించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. గతంలో సీఎం కేసీఆర్ రండ అనే పదాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి వాడారని గుర్తుచేశారు. ఆయన మాట్లాడితే పొగడ్తలు..  ఇతరులు మాట్లాడితే విమర్శలా..? అంటూ ప్రశ్నించారు.

మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ టౌన్​లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పీసీసీ మెంబర్ మహ్మద్ అలీఖాన్ బాబర్​తో కలిసి ఆయన మాట్లాడారు. బాల్క సుమన్ ఏం చేసి ఎమ్మెల్యే, ఎంపీ అయ్యాడో.. ఎలా అక్రమ ఆస్తులు సంపాదించాడో.. చిట్టా బయటపెడతామని హెచ్చరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సాగునీటి పేరిట జీవో నంబర్ 203తో ఏపీ సీఎం వైఎస్ జగన్  8 టీఎంసీల నీరు తీసుకుపోయేందుకు బాధ్యుడైనది కేసీఆర్ కాదా..?

ALSO READ : బీఆర్​ఎస్​ హయాంలో మహిళలకు రక్షణ లేదు

అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాకుండానే బీఆర్ఎస్ నేతలు తమ అక్కసు వెళ్లబోసుకుంటున్నారని మండిపడ్డారు. బాల్క సుమన్​ను తెలంగాణలో తరిమికొడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు తిరుపతిరెడ్డి, సీతారాం, ఖదీర్, హరినాథ్ రెడ్డి, ముబారక్ అలీ తదితరులు పాల్గొన్నారు.