జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : డాక్టర్ మట్టా దయానంద్

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం :  డాక్టర్ మట్టా దయానంద్

సత్తుపల్లి, వెలుగు : జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్​ ప్రభుత్వం, ఎమ్మెల్యే  రాఘమయి కట్టుబడి ఉన్నారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయకుమార్ అన్నారు. సోమవారం ప్రెస్ క్లబ్ సత్తుపల్లి ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రూ.20 లక్షలతో సత్తుపల్లి జర్నలిస్టులకు సహాయనిధి ఏర్పాటు చేస్తానని తాను ఇచ్చిన హామీని త్వరలోనే అమలు చేస్తానన్నారు.

మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ఖమ్మం తో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పనిచేసే జర్నలిస్టులకు సకాలంలో ఇండ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ అనిశెట్టి రఘు , ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుధాకర్ , ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నర్రా అరుణ్, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్​, ఎంపీపీ దొడ్డ హైమావతి శంకర్రావు, జడ్పిటిసి కూసంపూడి రామారావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణరెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు ఉడతనేని అప్పారావు, చల్లగుండ్ల నరసింహారావు 
పాల్గొన్నారు.