తంగళ్లపల్లి, వెలుగు: మంత్రి కేటీఆర్అహంకారపు మాటలు మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ రాష్ట్ర నేత కేకే మహేందర్ రెడ్డి అన్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని పైర్ అయ్యారు. గురువారం తంగళ్లపల్లి మండలం పాపయ్యపల్లెలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి ఇంటింటి ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో దోచుకున్న పైసలతో దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
కేటీఆర్ సిరిసిల్లను మాఫియాలకు అడ్డాగా మార్చాడని ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు కాంగ్రెస్‌లో చేరారు.