పెనుబల్లి, వెలుగు : పెనుబల్లి మండలం అడవిమల్లేలలోని లంకాసాగర్ ప్రాజెక్ట్ నుంచి గురువారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మట్టాదయనంద్ నీటిని విడుదల చేశారు. ఐబీఈఈ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పూజలు చేసి ప్రాజెక్ట్ గేట్లను ఎత్తారు.
అనంతరం అడవిమల్లేలలోని పీహెచ్సీని సందర్శించి పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐబీడీఈ రామారావు, జేఈ కిరణ్, మెడికల్ఆఫీసర్చింతా కిరణ్ కుమార్, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.