మంత్రి కేటీఆర్ ను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

మంత్రి కేటీఆర్ ను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

రాజన్నసిరిసిల్ల:  తన నియోజకవర్గమైన సిరిసిల్లలో డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి కాన్వాయ్ ను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా  ముస్తాబాద్ లో సోమవారం మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి కాన్వాయ్ ని అడ్డుకొని.. నిరసన తెలిపారు. దత్తత గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కేటీఆర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో కాంగ్రెస్ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. ముస్తాబాద్ లో 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలని మంత్రిని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం..

బాలీవుడ్ హిట్ నెంబర్కు స్టెప్పులేసిన సంజయ్, మాధురీ

‘రాధేశ్యామ్’ వాలెంటైన్ గ్లింప్స్ వచ్చేసింది