నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ కాంగ్రెస్ పార్టీలో చేరికను నిలిపివేసింది అధిష్టానం. ఏప్రిల్ 27 ఉదయం ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో పార్టీలో చేరారు మున్సిపల్ చైర్మన్ భార్గవ్. ఆయనతో పాటు 12 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. అయితే స్థానిక రాజకీయ కారణాల కారణంగా భార్గవ్ చేరికను నిలిపివేస్తున్నట్లు ప్రకటన రిలీజ్ చేసింది కాంగ్రెస్.
ఘర్ వాపసిలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరుతున్నారు పలువురు నేతలు. కొన్ని చోట్ల నేతల చేరికపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దేవరకద్ర నేత కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ ను పార్టీ లో చేర్చుకొని స్థానిక నేతల అభ్యంతరాల మేరకు నిలిపివేశారు. లేటెస్ట్ గా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ ను సైతం చేర్చుకుని నిలిపివేశారు.