
నల్గొండ అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. హుజుర్ నగర్ రోడ్ షోలో మాట్లాడిన ఆయన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శించారు. ఉత్తమ్ కు పార్లమెంట్ పరిధిలో ఏజెంట్ లు కూడా లేరని అన్నారు. నల్గొండ జిల్లాకు మంచినీటి కోసం ఎప్పుడైనా పోరాడారా అని ప్రశ్నించారు. దేశాన్ని 63 సంవత్సరాలు పరిపాలించాన కాంగ్రెస్ అభివృద్ధిని మరిచి సొంతలాభాన్ని మాత్రమే చూసుకుందని అన్నారు. ఉత్తమ్ ఎంపీ గెలుస్తాననే నమ్మకం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి లోక్ సభ స్థానానికి పోటీ చేయాలని అన్నారు జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచు కొంట కాదని…. మంచు కోట అని ఎద్ధేవా చేశారు.