నా చిట్టి చెల్లెను గెలిపించండి : రాహుల్ గాంధీ

నా చిట్టి చెల్లెను గెలిపించండి :  రాహుల్ గాంధీ
  • వయనాడ్ ఓటర్లను కోరిన రాహుల్ గాంధీ
  • వయనాడ్​ను పర్యాటక కేంద్రంగా మారుద్దామని పిలుపు

సుల్తాన్​బతేరి(వయనాడ్): వయనాడ్ ఎంపీగా తన చిట్టి చెల్లెలు ప్రియాంక గాంధీని గెలిపించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోరారు. ప్రియాంక గాంధీ.. ఎంపీ అభ్యర్థితో పాటు తన చెల్లెలు కూడా అని తెలిపారు. సుల్తాన్​బతేరిలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ‘‘ప్రియాంక గురించి వయనాడ్ ప్రజలకు ఫిర్యాదు చేసే హక్కు నాకున్నది. 

రాజకీయాలు పక్కనపెట్టేద్దాం.. వయనాడ్ అంటే నాకెంతో ఇష్టం.  నా గుండెల్లో ఇక్కడి ప్రజల కోసం ఎప్పటికీ స్థానం ఉంటది. ఏ టైమ్​లో అయినా హెల్ప్ అడిగితే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను రెండు సార్లు గెలిపించారు. ఇప్పుడు నా చెల్లెను గెలిపిస్తే ఇక్కడి ప్రజలకు సేవ చేస్తది. వయనాడ్ అందాలను బయటి ప్రపంచానికి చూపిద్దాం. టూరిజంను మరింత అభివృద్ధి చేసుకుందాం’’ అని రాహుల్  గాంధీ కోరారు. 

టూరిజం సెక్టార్ డెవలప్ అయితది

ప్రియాంకకు నేను ఓ సవాల్ విసురుతున్నాను. వయనాడ్​ను బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్​గా మార్చాలి. కేరళలో బెస్ట్ ప్లేస్ ఏది అంటే.. అందరికీ వయనాడే గుర్తుకు రావాలి. ఆ విధంగా టూరిజం సెక్టార్​ను డెవలప్ చేయాలి. టూరిజం డెవలప్ అయితే.. ఇక్కడి ప్రజలు ఆర్థికంగా ఎంతో వృద్ధి సాధిస్తారు. ఉపాధి అవకాశాలు మెరుగుపడ్తాయి’’ అని రాహుల్ గాంధీ చెప్పారు. రాజకీయాల్లో ప్రేమకు ఎంతో కీలకమైన స్థానం ఉందని వయనాడ్ ప్రజల నుంచి తాను నేర్చుకున్నట్లు తెలిపారు. ద్వేషం, కోపాన్ని ఎదుర్కోగల ఆయుధాలు ప్రేమ, ఆప్యాయత అని చెప్పారు.