స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం : పూజల హరికృష్ణ    

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం : పూజల హరికృష్ణ    
  • కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరికృష్ణ     

సిద్దిపేట రూరల్, వెలుగు: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్​దే విజయమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరికృష్ణ అన్నారు. శనివారం రూరల్ మండలంలోని బుస్సాపూర్ లో రూ.10లక్షలతో చేపడుతున్న బీరప్ప దేవాలయం, గౌడ సంఘం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ మండలానికి ఇప్పటికే రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు చెబుతూ పంచాయతీ ఎన్నికల్లో ముందుకు వెళ్తామన్నారు. కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా ఉండి బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి, ఇందిరమ్మ రాజ్యం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పాండు, అధికార ప్రతినిధి బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ సదాశివారెడ్డి, సీనియర్ నాయకులు కలిమొద్దీన్, యాదయ్య, కిషన్, ఆంజనేయులు, కనకయ్య, మల్లేశం పాల్గొన్నారు.