న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియ నిబంధనల్లో కేంద్రం మార్పులు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల కమిషన్ (ఈసీ) సిఫారసు మేరకు ఇటీవల చేసిన సవరణలను సవాలు చేస్తూ మంగళవారం ఆ పార్టీ నేత జైరాం రమేశ్రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అమెండ్మెంట్తో ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలుగుతుందని పిటిషన్లో కాంగ్రెస్పేర్కొంది. ఎలక్షన్స్‌కు సంబంధించి ఎలక్ట్రానిక్ రికార్డ్స్‌ను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఈసీ ఇటీవల మార్పులు చేసింది.
పోలింగ్‌కు సంబంధించిన సీసీటీవీ, వెబ్‌కాస్టింగ్ ఫుటేజీలతోపాటు అభ్యర్థుల వీడియో రికార్డింగ్‌ల లాంటి కొన్ని వంటివి దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు ఎన్నికల నియమావళిని సవరించింది. ఈసీ సిఫార్సుల మేరకు కండక్ట్ఆఫ్ఎలక్షన్రూల్స్, 1961లో నిబంధనలకు కేంద్ర న్యాయశాఖ సవరణలు చేసింది. కాగా, ఈ చర్యలను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
ఏకపక్షంగా ఎలా సవరిస్తారు: జైరాం రమేశ్
ఎన్నికల నిబంధనల్లో మార్పులను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్ట్‌పెట్టారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్.. ప్రజలతో సంప్రదించకుండా ఏకపక్షంగా రూల్స్‌ను ఎలా సవరిస్తుందని ప్రశ్నించారు. దీన్ని అనుమతించవద్దని కోర్టును కోరామన్నారు. ఈ చర్యలతో ఎన్నికల ప్రక్రియ సమగ్రత దెబ్బతింటున్నదని, దానిని పునరుద్ధరించేందుకు సుప్రీం సాయపడుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.