కాంగ్రెస్​ రాగానే రూ.2 లక్షల రుణమాఫీ : బాన్సువాడ అభ్యర్థి ఏనుగు రవీందర్​రెడ్డి

బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ మండలంలోని తాడ్కోల్, బుడ్మి, తిరుమలాపూర్ తదితర గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి రవీందర్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డిని బోనాలు, మంగళహారతులతో స్వాగతం పలికారు.

కదిలాపూర్ గ్రామానికి చెందిన యువకులు రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో అనేక పథకాలను రూపొందించిందన్నారు. అధికారంలోకి రాగానే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఆయన వెంట ప్రతాప్ సింగ్ రాథోడ్, మధుసూదన్ రెడ్డి, మంత్రి గణేశ్, మైలారం భాస్కర్ రెడ్డి, జీవన్ తదితరులు ఉన్నారు.

Also Read :- ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిఫ్టీ..పడిన హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐటీ షేర్లు