![ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలాజగ్గారెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/congress-to-win-mlc-elections-says-tgiic-chairperson-nirmala-jagga-reddy_jtEOqLm7XR.jpg)
సిద్దిపేట, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సిద్దిపేటలోని పొన్నాలలో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందన్నారు.
.ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అత్తు ఇమామ్ నిర్మలా జగ్గారెడ్డిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో టీపీసీసీ సెక్రెటరీ యాదగిరి, బొమ్మల యాదగిరి, శంకర్, మధు, గయాజుద్దీన్, రాజు, కలిమొద్దీన్, షాబుద్దీన్, దాసాంజనేయ, ప్రవీణ్, రాకేశ్ పాల్గొన్నారు