ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్​, వెలుగు: కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు నిర్వహించనున్న ‘హాత్​సే హాత్​జోడో యాత్ర’ను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌‌‌‌‌‌‌‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 26 నుంచి 60 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర కోసం శుక్రవారం నగరంలోని పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంతో పాటు తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాల్లో కాంగ్రెస్ ఎంతో కీలకంగా పని చేసిందన్నారు. అదే స్ఫూర్తితో జోడో కార్యక్రమాన్ని నిర్వహించాలని, ప్రతి వార్డు, ప్రతి పల్లెను పర్యటించి ప్రజలతో మమేకం కావాలన్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగాలన్నారు. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్​బిన్​హందాన్, ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నగర శాఖ అధ్యుక్షుడు కేశవేణు తదితరులు పాల్గొన్నారు. 

ఓటీఎస్‌‌‌‌‌‌‌‌పై అవగాహన కల్పించాలి

వర్ని, వెలుగు: ఓటీఎస్‌‌‌‌‌‌‌‌పై రైతులకు అవగాహన కల్పించాలని డీసీసీబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌పోచారం భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. మండల కేంద్రంలో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీసీసీ వర్ని బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్‌‌‌‌‌‌‌‌ను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ బ్యాంకులో తీసుకున్న రుణాలకు సంబంధించి ఎంత మొత్తం మాఫీ అవుతుందో వివరాలు తెలియజేయాలని, సొసైటీ చైర్మన్లను సమన్వయంతో పాత బకాయిలను వసూలు చేయాలని సూచించారు. ఈ నెల 31వ తేదీ వరకు ఓటీఎస్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌స్కీం ముగుస్తుందన్నారు. అంతకుముందు మండల కేంద్రంలోని పాత వర్నిలో రూ.పది లక్షలతో నూతనంగా నిర్మించనున్న ఎస్సీ  కమ్యూనిటీహాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భూమిపూజ చేశారు. ఎంపీపీ మేక శ్రీలక్ష్మి, జడ్పీటీసీ హరిదాసు, జాకోరా విండో చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తరిమికొట్టండి

నిజామాబాద్, వెలుగు: తెలంగాణ అవిర్భావం నుం చి రెండు ధపాల ఎన్నికల్లో హామీలు ఇచ్చి అన్ని వర్గాలను మోసగించిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి తరిమికొట్టాలని బీజేపీ పిలుపుని చ్చింది. ఇందూరు జిల్లా పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో జిల్లా ప్రెసిడెంట్ బస్వా లక్ష్మీనర్సయ్య,  ప్రభారి ధీరజ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, అర్బన్ పాలక్ బండా కార్తీక్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించి దగా చేశారని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి, ఉచిత ఎరువుల పంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మార్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టాడని ఆరోపించారు. కేసీ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలనపై ప్రజలు విసిగిపోయారని రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇటు రాష్ట్రంలో అటు దేశంలో మళ్లీ బీజేపీని గెలిపించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. నేడు జరిగే వర్చువల్ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్నారని చెప్పారు. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ మీటింగ్ కోసం శ్రీరామ గార్డెన్‌‌‌‌‌‌‌‌లో, ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంఆర్ గార్డెన్, బాల్కొండ మీటింగ్‌‌‌‌‌‌‌‌కు మోర్తాడ్ లలిత గార్డెన్స్‌‌‌‌‌‌‌‌లో, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ మీటింగ్‌‌‌‌‌‌‌‌కు ఏఎన్ఆర్ గార్డెన్‌‌‌‌‌‌‌‌లో, బోధన్ అసెంబ్లీ మీటింగ్‌‌‌‌‌‌‌‌కు రవి గార్డెన్స్‌‌‌‌‌‌‌‌లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు న్యాలం రాజు, పొతన్‌‌‌‌‌‌‌‌కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్మీనారాయణ, మహిళా మోర్చా ప్రతినిధి స్రవంతిరెడ్డి, మహిళా మోర్చా జిల్లా ప్రెసిడెంట్ పంచారెడ్డి ప్రవళిక, ఎస్సీ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ శివప్రసాద్, కార్పొరేటర్లు సుధీర్, మమత, నాయకులు నారాయణ, విజయ్, ఖైజర్, శంకర్, వీరేంధర్, సుధీర్ పాల్గొన్నారు. 

‘స్కీమ్‌’ కార్మికుల నిరసన

ప్రభుత్వం స్కీంలను ప్రైవేటీకరించే ఆలోచనను కేంద్రం ఆపాలని వివిధ స్కీంలలో పనిచేసే కార్మికులు డిమాండ్‌‌‌‌ ‌‌‌‌చేశారు. సీఐటీయూ కేంద్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్‌‌‌‌ జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్‌‌‌‌‌‌‌‌, ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌ల ముందు నిరసన తెలిపారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత, పీఎఫ్‌‌‌‌‌‌‌‌, ఈఎస్‌‌‌‌‌‌‌‌ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌‌‌‌ ‌‌‌‌చేశారు. ఆయా కార్యక్రమాల్లో సీఐటీయూ లీడర్లు, పలు స్కీంలలో పనిచేస్తున్న కార్మికులు పాల్గొన్నారు.

- వెలుగు, నెట్‌‌‌‌వర్క్‌‌‌‌

టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి

పిట్లం, వెలుగు: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకున్నప్పుడే అనుకున్నది సాధిస్తామని ఎమ్మెల్యే హన్మంత్​షిండే అన్నారు. బిచ్కుంద మండలం పెద్ద దేవాడలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో పంటలకు పురుగులమందు పిచికారీ కోసం ఏర్పాటు చేసిన డ్రోన్ యంత్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రోన్లతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఖర్చు తగ్గడంతో పాటు తక్కువ సమయంలో పనులు పూర్తి చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్​పటేల్, సర్పంచ్ జంగం శివానందప్ప, మార్కెట్​ కమిటీ ప్రెసిడెం ట్ మల్లికార్జునప్ప నాయకులు రాజు, ఐకేపీ ఏపీఎం  నా గరాజు, మండల సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

కంటి వెలుగుకు ఏర్పాట్లను పూర్తి చేయాలి

లింగంపేట,వెలుగు: ఈనెల18 నుంచి చేపట్టనున్న కంటి వెలుగు కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను  పూర్తి చేయాలని డీఎల్పీవో సురేందర్ కార్యదర్శులకు సూచించారు. నాగిరెడ్డిపేట మండల పరిషత్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం  పంచాయతీ సెక్రటరీలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండలంలోని అన్నీ గ్రామాల్లో కంటి వెలుగు కోసం ఏర్పాట్లను చేయాలని చెప్పారు. గ్రామాల్లో వంద శాతం ఇంటి పన్నులను వసూలు చేయాలని, క్రీడా ప్రాంగణాలను సకాలంలో పూర్తి చేయాలని, నర్సరీల్లో మొక్కల పెంపకంపై స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రఘు, ఎంపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఓటీఎస్‌‌‌‌‌‌‌‌పై అవగాహన కల్పించాలి

వర్ని, వెలుగు: ఓటీఎస్‌‌‌‌‌‌‌‌పై రైతులకు అవగాహన కల్పించాలని డీసీసీబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌పోచారం భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. మండల కేంద్రంలో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీసీసీ వర్ని బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్‌‌‌‌‌‌‌‌ను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ బ్యాంకులో తీసుకున్న రుణాలకు సంబంధించి ఎంత మొత్తం మాఫీ అవుతుందో వివరాలు తెలియజేయాలని, సొసైటీ చైర్మన్లను సమన్వయంతో పాత బకాయిలను వసూలు చేయాలని సూచించారు. ఈ నెల 31వ తేదీ వరకు ఓటీఎస్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌స్కీం ముగుస్తుందన్నారు. అంతకుముందు మండల కేంద్రంలోని పాత వర్నిలో రూ.పది లక్షలతో నూతనంగా నిర్మించనున్న ఎస్సీ  కమ్యూనిటీహాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భూమిపూజ చేశారు. ఎంపీపీ మేక శ్రీలక్ష్మి, జడ్పీటీసీ హరిదాసు, జాకోరా విండో చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

కిసాన్ సర్కారు కాదు.. కసాయి సర్కారు

స్టేట్‌‌లో ఉన్నది కిసాన్ సర్కారు కాదని, కసాయి సర్కారు అని మాజీ మంత్రి, కాంగ్రెస్​నేత షబ్బీర్​అలీ విమర్శించారు. మాస్టర్ ప్లాన్‌‌పై రైతులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం కానీ, లోకల్ ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదన్నారు. దున్నపోతు ప్రభుత్వంగా మారిందన్నారు. మాస్టర్ ప్లాన్‌‌పై మంత్రి కేటీఆర్ అఫీషియల్‌‌గా ప్రకటించాలన్నారు. రైతుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందన్నారు.  

అవెన్యూ ప్లాంటేషన్‌‌‌‌పై దృష్టి పెట్టండి

నిజామాబాద్, వెలుగు: హరితహారంలో భాగంగా ప్రధాన రహదారులకు ఇరువైపులా ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మాక్లూర్ మండలం మామిడిపల్లి నుంచి ఆర్మూర్, అర్గుల్ మీదుగా డిచ్‌‌‌‌పల్లి వరకు ఉన్న అవెన్యూ ప్లాంటేషన్‌‌‌‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అంకాపూర్ శివారులో రోడ్డుకు ఆనుకుని ఉన్న పంట పొలంలో వరి నాట్లు వేస్తున్న వ్యవసాయ కూలీలను గమనించిన కలెక్టర్, వారి వద్దకు వెళ్లి కొద్ది సేపు ముచ్చటించారు. రోజువారీ కూలీ ఎంత గిట్టుబాటు అవుతోంది, ఎన్ని గంటలు పని చేస్తారు, ఒక ఎకరం విస్తీర్ణంలో నాట్లు వేసేందుకు ఎంత మంది కూలీలు అవసరం అవుతారు.. తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నగర శివారులోని చిన్నాపూర్ వద్ద ఉన్న అర్బన్ పార్క్‌‌‌‌ను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట అడిషనల్‌‌‌‌ కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా ఉన్నారు.