నిజామాబాద్, వెలుగు: కేసీఆర్ గవర్నమెంట్మళ్లీ వస్తే నిరుద్యోగ యువత బతుకులు ఆగమవుతాయని కాంగ్రెస్అర్బన్అభ్యర్థి షబ్బీర్‌అలీ వాపోయారు. గురువారం ఆయన నామ్దేవ్వాడలో కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగమని రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారన్నారు. నిరుద్యోగ యువతి ప్రవళిక సూసైడ్ చేసుకుంటే, ప్రేమ విఫలమైందంటూ తప్పుడు ప్రచారం చేసి ఆమె కుటుంబాన్ని రోడ్డుకీడ్చారన్నారు.
కాంగ్రెస్గవర్నమెంట్వస్తేనే ఉద్యోగాలు వస్తాయన్నారు. యువతే కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యత తీసుకోవాలన్నారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తారీకున జీతాలు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. పాలిటెక్నిక్ గ్రౌండ్లో మార్నింగ్ వాక్‌లో ఓటర్లను కలిసి గెలిపించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. గడుగు గంగాధర్, నరాల రత్నాకర్, రామకృష్ణ, దయాకర్, నజీబ్అలీ, శరత్, ప్రవీణ్‌గౌడ్, వేణుగౌడ్ పాల్గొన్నారు.