ఎలక్షన్ క్యాంపెయిన్ .. AI వాడకంలో కాంగ్రెస్ పార్టీ జోరు

2014 , 2019 లోక్ సభ ఎన్నికల క్యాంపెయిన్​లో  సోషల్ మీడియా కీలక పాత్ర పోషించగా..ఇప్పుడు దానికి మరో టెక్నాలజీ జతైంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). ప్రస్తుతం దేశవ్యాప్తంగా  ఏఐ జోరు కొనసాగుతున్నది. ఈ టెక్నాలజీతో వివిధ పథకాలను, ప్రకటనలను పార్టీలు ఈజీగా ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి. పార్టీ ఉద్దేశాలను తక్కువ ఖర్చుతో, తక్కువ టైంలో  ఎక్కువ మంది ఓటర్లకు రీచ్ అయ్యేలా ప్రచారం  చేస్తున్నాయి. పక్క పార్టీపై విమర్శలు గుప్పించాలన్నా.. తమ పార్టీ గురించి పాజిటివ్‌‌గా ప్రచారం చేయాలన్నా ఏఐకి పనిచెప్తున్నాయి

ఏఐ వాడకంలో కాంగ్రెస్ జోరు 

కాంగ్రెస్ పార్టీ ఏఐ టెక్నాలజీ ద్వారా కార్యక్రమాలను రెడీ చేసి ప్రచారంలో ఉపయోగిస్తున్నది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ “మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి ”అనే స్లోగన్ తో గత అధికార పార్టీ నేతలు చేసిన అవినీతిని వీడియోల రూపంలో ప్రచారంలో ఉపయోగించి సక్సెస్ అయ్యారు. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్లి పార్టీ గెలుపునకు ఉపయోగపడిందని నేతలు చెబుతున్నారు.

ALSO READ :- పార్లమెంట్ ఎన్నికల్లో చేరికల పైనే కాంగ్రెస్ ఫోకస్

ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ప్రచారంలోనూ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలతో పాటు తన100 రోజుల పాలనలో చేసిన అభివృద్ధిపై ఏఐ ద్వారా వీడియోలు క్రియేట్ చేస్తున్నది. వాటిద్వారా పార్టీ ఉద్దేశాన్ని నిరక్షరాస్యులకు  ఈజీగా  అర్థమయ్యేలా ప్లాన్ చేస్తున్నది. త్వరలో  నామినేషన్లు స్టార్ట్ కానున్న నేపథ్యంలో అప్పటి కల్లా ఏఐ వీడియోలను ఫైనల్ చేసేందుకు పార్టీకి పనిచేస్తున్న టెక్ నిపుణులు రెడీ అవుతున్నారు.