కాంగ్రెస్ గెలుపు పక్కా : ఎంపీ, ఎమ్మెల్యే  సురేశ్​షెట్కార్​, సంజీవరెడ్డి

కాంగ్రెస్ గెలుపు పక్కా : ఎంపీ, ఎమ్మెల్యే  సురేశ్​షెట్కార్​, సంజీవరెడ్డి

నారాయణ్ ఖేడ్, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు పక్కా అని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం ఖేడ్ పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన మీటింగ్​లో కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డితో కలిసి మాట్లాడారు.

గ్రాడ్యుయేట్స్ అందరూ విద్యావేత్త అయిన నరేందర్ రెడ్డికి సపోర్ట్ గా ఉండాలన్నారు. కాంగ్రెస్ ద్వారా మాత్రమే గ్రాడ్యుయేట్స్ కు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాకేశ్ శెట్కార్, రమేశ్ చౌహన్ పాల్గొన్నారు.


భక్త మార్కండేయ ఆలయ ప్రారంభోత్సవానికి మంత్రికి ఆహ్వానంనారాయణఖేడ్ పట్టణ శివారులోని వెంకటాపూర్ చౌరస్తా లో నిర్మించిన భక్త మార్కండేయ ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఖేడ్ పద్మశాలి కుల బాంధవులు, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్ తో కలిసి మంత్రి దామోదర రాజ నర్సింహకు ఆహ్వాన పత్రిక అందజేశారు.